మార్కెట్లోకి శాంసంగ్ M31 వచ్చేసింది

మార్కెట్లోకి శాంసంగ్ M31 వచ్చేసింది

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ శాంసంగ్ కొత్త మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. గెలాక్సీ M31 పేరుతో రెండు వేరియంట్లలో ఫోన్ తయారు చేశారు. సరికొత్త ఫీచర్లతో దీన్ని రూపొందించినట్టు ఆ సంస్థ తెలిపింది. మార్చి5వ తేదీ నుంచి అమెజాన్, శాంసంగ్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్లతో పాటు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్ల‌లో వీటిని అందుబాటులోకి ఉంచనున్నారు. లాంచింగ్ ఆఫర్ కింద దీనిపై డిస్కౌంట్లను కూడా ప్రకటించింది. క్వాడ్ రియర్ కెమెరా సెటప్, అతి పెద్ద బ్యాటరీ, వాటర్‌డ్రాప్ స్టైల్ నాచ్ వంటి ఫీచర్లు ఈ మొబైల్స్ లో ఉన్నాయి. 64 GB ఇన్‌బుల్ట్ మెమోరి ఫోన్ ధర రూ. 15,999, 128 GB ఇన్‌బుల్ట్ మెమొరీ ఫోన్ ధర రూ.16,999 గా నిర్ణయించారు. ప్రారంభ ఆఫర్ కింద రూ. 1000 తగ్గించారు.

శాంసంగ్ M31 ఫీచర్లు : 

స్క్రీన్- 6.4 అంగుళాలు

బ్యాటరీ- 6,000 MAH

ర్యామ్- 6GB

స్టోరేజీ- 64 GB, 128 GB

మైక్రోఎస్డీ కార్డు- 512 GB వరకు

కెమెరా- 64MP+8MP, 5MP +5 MP

సెల్ఫీ కెమెరా- 32 MP