కరోనా దెబ్బతో మూతపడిన శామ్‌సంగ్ ప్లాంట్
వివో, ఒప్పో, ఎల్‌జీ ఫ్యాక్టరీలు కూడా షట్‌డౌన్
అదే బాటలో వాహన తయారీ సంస్థలు కూడా
న్యూఢిల్లీ: స్మార్ట్ ఫోన్ మేకర్ శామ్‌సంగ్ ఇండియాలోని తమ ప్లాంట్‌ను సోమవారం షట్ డౌన్ చేసింది. కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా ప్రభుత్వం ఈ విధంగా చేయాలని కంపెనీలను కోరింది. నోయిడాలోని ప్లాంట్‌ను ఈ నెల 23 నుంచి 25 వరకు షట్ డౌన్ చేస్తున్నామని శామ్‌సంగ్ పేర్కొంది. ఈ ప్లాంట్ కంపెనీకి ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ ప్లాంట్. ఇక్కడ ఏడాదికి 12 కోట్ల ఫోన్లు తయారవుతున్నాయి. శామ్‌సంగ్ కంపెనీయే కాకుండా, ఎల్‌జీ, ఒప్పో, వివో వంటి స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు కూడా ఇండియాలో తమ ఫ్యాక్టరీలను, కార్యకలాపాలను క్లోజ్ చేశాయి. కరోనా విస్తరిస్తుండడంతో దేశంలో ఆటోమొబైల్, తయారీ కంపెనీలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. ఇండియాలో తమ కార్యకలాపాలను తాత్కాలికంగా మూసివేస్తున్నామని యమహా మోటర్స్, రెనో నిస్సాన్ ఆటోమోటివ్, భారత్ ఫోర్జ్, మిందా ఇండస్ట్రీస్ సోమవారం ప్రకటించాయి.
For More News..