హైదరాబాద్, వెలుగు: శామ్సంగ్ తన కొత్త ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌ను హైదరాబాద్‌లోని ఇనార్బిట్ మాల్లో బుధవారం ప్రారంభించింది. 3,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ అవుట్‌లెట్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఆడియో, గేమింగ్ ప్రొడక్టులు, టీవీలు అమ్ముతారు. ఈ కంపెనీకి తెలంగాణలో 56 బ్రాండ్ స్టోర్లు ఉన్నాయి. మన రాష్ట్రంలో శామ్సంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లలో ప్రీమియం ఉత్పత్తుల కంట్రిబ్యూషన్ 50శాతం వరకు ఉంది.
హైదరాబాద్ నగరంలో ఇది 65శాతం వరకు ఉంది. 2023లో తెలంగాణ రాష్ట్రంలో ప్రీమియం కంట్రిబ్యూషన్‌ను 60 శాతానికి, హైదరాబాద్ నగరంలో 70 శాతానికి తీసుకోవాలని శామ్సంగ్ లక్ష్యంగా పెట్టుకుంది. 2022లో తెలంగాణలోని బ్రాండ్ స్టోర్లలో 30శాతం బలమైన వృద్ధిని సాధించామని సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు. రాబోయే పండుగ సీజన్ నేపథ్యంలో రాష్ట్రంలో 30శాతం కంటే ఎక్కువ వృద్ధిని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాదిలోపు మరో 15 అవుట్లెట్లు ఏర్పాటు చేస్తామని వివరించారు.