ధర ఎక్కువైనా పడి పడి కొన్నారు.. 2024లో ఈ స్మార్ట్‌ఫోన్లదే రాజ్యం

ధర ఎక్కువైనా పడి పడి కొన్నారు.. 2024లో ఈ స్మార్ట్‌ఫోన్లదే రాజ్యం

గతంలో మనిషి మనుగడ సాగించాలంటే.. తినడానికి తిండి, త్రాగడానికి నీరు, ఉండటానికి గూడు ఉంటే చాలనేవారు. కానీ, ఇప్పుడు కాలం మారింది. మనుషుల అలవాట్లూ మారాయి. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే పైవేవీ అక్కర్లేవని నిరూపిస్తున్నారు. శుభోదయాన మొదలుపెడితే.. సూర్యాస్తమయం వరకూ ఒకటే నొక్కుడు. ఇంకాస్త అధునాతన ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉన్నదంటే.. అసలు ఎక్కడ ఉన్నామనే విషయాన్నే పట్టించుకోవట్లేదు. అలా ఉంది ఇప్పటి తీరు. 

అంతలా మొబైల్ ప్రియులను ఆకర్షించి ఏడాది మొత్తం స్మార్ట్‌ఫోన్ ప్రపంచాన్ని ఏలిన కొన్ని ఫ్లాగ్‌షిప్ ఫోన్స్ కొన్నింటిని చూద్దాం. ఈ స్మార్ట్‌ఫోన్ల కాస్త ధర ఎక్కువైనప్పటికీ.. లుక్ పరంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్ వంటి ఫీచర్ల పరంగా వినియోగదారులను బాగా ఆకట్టుకున్నాయి.. 

Samsung Galaxy S24 Ultra

హైఎండ్ మొబైల్స్ వాడే వారికి శాంసంగ్ ఎస్24 అట్రా(Samsung Galaxy S24 Ultra) సూపర్బ్ మొబైల్ అని చెప్పుకోవాలి. ఎస్24 అట్రా ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌గా ఈ ఏడాది టాప్ లో నిలిచింది. AI-ఆధారిత ఫీచర్లు, 4855mAh బ్యాటరీ, 3x మరియు 5x ఆప్టికల్ జూమ్‌, టెలిఫోటో లెన్స్‌లతో ఫోటోగ్రఫీ వంటి అధునాత ఫీచర్లు మొబైల్ ప్రియులను కట్టిపడేశాయి.

ధర: రూ. 98,890(అమెజాన్)

Motorola Razr 50 Ultra

ఫోల్డబుల్ డిజైన్‌తో వచ్చిన Razr 50 Ultra ఈ ఏడాది అమ్మకాల్లో గణనీయమైన పెరుగుదలను చూపించింది. 4-అంగుళాల LTPO AMOLED ఔటర్ డిస్‌ప్లే, 50MP ప్రధాన కెమెరాతో డ్యూయల్ కెమెరా సెటప్‌, AI ఆధారిత Google జెమిని అసిస్టెంట్‌ ఫీచర్ వినియోగదారులను బాగా ఆకర్షించాయి. 

ధర: రూ. 79,999(అమెజాన్)

Apple iPhone 16 Pro Max

ఐఫోన్ మోడళ్లు, ఐఫోన్ ఫీచర్లు గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నిజానికి ఐఫోన్ ను ఓ బ్రాండ్ కోసం ఉపయోగిస్తుంటారు. ఆండ్రాయిడ్ ఫోన్లతో పోలిస్తే, వీటి యూసేజ్ భిన్నంగా ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్లలోవలె అన్ని రకాల యాప్ లను డౌన్ లోడ్ చేయలేరు. ప్రైవసీ పరంగాను కొందరు ఐఫోన్లను ది బెస్ట్ అని చెప్తుంటారు. మూడు నెలల క్రితం మార్కెట్ లోకి వచ్చిన iPhone 16 Pro Max అమ్మకాల్లో టాప్ లో నిలిచింది. అధునాతన వీడియో ఎడిటింగ్, స్పేషియల్ ఆడియో, కన్సోల్-స్థాయి గేమింగ్ వంటి ప్రొఫెషనల్-గ్రేడ్ ఫీచర్లు క్రియేటర్లను, ప్రొఫెషనల్స్ ను బాగా ఆకర్షించాయి. 

ధర: రూ. 1,44,900 (256GB, ఫ్లిప్‌కార్ట్)

Vivo X Fold 3 Pro

ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో Vivo X ఫోల్డ్ 3 ప్రో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాంపాక్ట్ డిజైన్, అధిక-నాణ్యత గల డిస్‌ప్లేలు, ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ ఇమేజింగ్ సిస్టమ్, వాటర్ ఇన్‌గ్రెస్ ప్రొటెక్షన్ వంటివి ప్రీమియం ఫోన్లు వాడేవారిని బాగా ఆకట్టుకున్నాయి. ఫోల్డబుల్ ఫోన్లలో దీర్ఘకాలం మన్నిక కోరుకునే వారికి ఇది ఒక సాలిడ్ ఆప్షన్‌ అని చెప్పుకోవాలి. ఇందులో అధునాతన AI-ఆధారిత ఫీచర్లు లేకపోవడం మైనస్.

ధర: రూ. 1,58,999 (ఫ్లిప్‌కార్ట్)

OPPO Find X8 Pro

ఒప్పో ఫైండ్ X8 ప్రో  అనేది ఫీచర్-రిచ్ స్మార్ట్‌ఫోన్. దీని కెమెరా సిస్టమ్, డిస్‌ప్లే, బిల్డ్ క్వాలిటీ, బ్యాటరీ పనితీరులో అద్భుతంగా ఉంది. కెమెరా క్వాలిటీ కూడా సూపర్బ్ అని చెప్పుకోవచ్చు. 

ధర రూ. 98,999 (ఫ్లిప్‌కార్ట్)