హై ఎండ్ ఫోన్లలో యాపిల్, గూగుల్ పిక్సెల్‌లు బెస్ట్ కెమెరాతో ఆకట్టుకుంటున్నాయి. ఈ విషయంలో సామ్సంగ్ వాటికి పోటీ ఇవ్వలేకపోతోంది. అందుకే త్వరలో వాటికి మించిన కెమెరాతో కొత్త మొబైల్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అది కూడా 64 ఎంపీ కెమెరాకు సన్నాహాలు చేస్తోంది.
ఇప్పటికే చాలా ఫోన్లలో ‘48 ఎంపీ ఐసోసెల్’ కెమెరాలొచ్చాయి. స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఫొటోలు, వీడియోలు తీసుకుని వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అందుకే వినియోగదారులు మంచి కెమెరా ఉన్న ఫోన్లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో బెస్ట్ కెమెరా ఉన్న లేటెస్ట్ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. యాపిల్, గూగుల్ పిక్సెల్‌తోపాటు వివో, ఒప్పో, రెడ్మి వంటి బ్రాండ్లు మంచి కెమెరా ఫోన్లను రూపొందిస్తున్నాయి. ఫలితంగా సామ్సంగ్ మార్కెట్ తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో సామసంగ్ కెమెరా ఫీచర్‌పై దృష్టి సారించింది.
64 ఎంపీ కెమెరా
సరికొత్త 64 ఎంపీ ఐసోసెల్ బ్రైట్ జీడబ్ల్యూ1 కెమెరాను సామ్సంగ్ రూపొందిస్తోంది. ప్రత్యేక అల్గారిథమ్‌ను ఉపయోగించుకుని ఈ కెమెరా 48 ఎంపీ సెన్సర్లకంటే మరింత స్పష్టమైన ఇమేజెస్‌ను క్యాప్చర్ చేస్తుంది. జీడబ్ల్యూ1 సెన్సర్లు హెచ్డిఆర్ను సపోర్ట్ చేస్తాయి. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ టెక్నాలజీ సక్సైస్ అయితే, పూర్తి స్థాయిలో ఫోన్లలో అందుబాటులోకి వస్తుంది.