సామ్సంగ్ తన మిడ్ రేంజ్ పాపుల్ ఫోన్ గెలాక్సీ ఎఫ్ 34 ధరను తగ్గించింది. ఈ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తోంది. రెండింటిపై కూడా రూ.3000 లు డిస్కౌంట్ లభిస్తోంది. కంపెనీ ఈ ఫోన్ ను గత ఏడాది ఆగస్టు 2023లో విడుదల చేసింది. Galaxy F34 రెండు వేరియంట్లలో వస్తుంది. 6GB+128 GB కోసం ధర రూ. 18,999 కాగా 8GB+128 GB ధర రూ. 20,999. ఇవి డిస్కౌంట్ తర్వాత కస్టమర్లకు 6GB+128 GB మోడల్ రూ.15,999, 8GB+128 GB మోడల్ రూ. 17,999 కి కొనుగోలు చేయొచ్చు.
ఫీచర్ల విషయానికొస్తే Samsung Galaxy F34 5G 6.46 అంగుళాల ఫుల్ HD+SAMOLED డిస్ ప్లేను కలిగి ఉంటుంది. ఇది 2340x1080 పిక్సెల్ రిజల్యూషన్ తో అందుబాటులో ఉంది. ఫోన్ డిస్ ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 398ppi పిక్సెల్ డెన్సిటీ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5రక్షణతో లభిస్తోంది. స్టోరేజ్ విషయానికి వస్తే .. ఈ ఫోన్ 8GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో ఇన్ హౌస్ ఆక్టా కోర్ Exynos 12080 Soc లో పనిచేస్తుంది. ఈ ఫోన్ Android13 ఆధారిత One UI 5.1తో రన్ అవుతుంది.
శక్తివంతమైన కెమెరా లెన్స్
కెమెరాగా Samsung Galaxy F34 5G లో 50 మెగా పిక్సెల్ ప్రైమరి సెన్సార్, అల్ట్రా వైట్ యాంగిల్ లెన్స్ తో కూడిన 8 మెగా పిక్సెల్ సెన్సార్, బ్యాక్ కెమెరా 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్ లు ఉన్నాయి. ఈ సెన్సార్ LED ఫ్లాష్ తో పాటు, వెనక ప్యానెల్కు ఎగువ ఎడమవైపున మూడు వృత్తాకార స్లాట్ లలో కనిపిస్తుంది. సెల్ఫీ కోసం మధ్య సమలేఖనం చేయబడిన వాటర్ డ్రాప్ నాచ్ లో 13 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా లెన్స్ అందుబాటులో ఉంది.
ఛార్జింగ్ విషయానికొస్తే.. ఈ ఫోన్ పవర్ కోసం 6000 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఫోన్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. కనెక్టవిటీ కోసం ఇది 5G, GPS, NFC,WiFi, బ్లూటూత్ v5.3, USB- C కి మద్దతునిస్తుంది. ఈ ఫోన్ ఎలక్ట్రిక్ బ్లాక్, మిస్టిక్ గ్రీన్ , ఆర్చిడ్ వైలెట్ రంగులలో లభిస్తుంది. దీనిని Flipkart, Samsung ఈ స్టోర్ల నుంచి కొనుగోలు చేయవచ్చు.