
రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా తనను నియమించినందుకు సముద్రాల వేణుగోపాల చారి ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని సముద్రాల వేణుగోపాల చారి తెలిపారు. ఈ పదవిలో వేణుగోపాలాచారి రెండేండ్ల వరకు కొనసాగనున్నారు.
మూడు సార్లు ఎంపీగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా, కేంద్ర, రాష్ట్ర మంత్రిగా ఆయన గతంలో పని చేశారు. స్వరాష్ట్రంలో అధికాంలోకి వచ్చిన సీఎం కేసీఆర్.. ఆయనకు ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధిగా అవకాశం కల్పించారు. 1995లో చంద్రబాబు నాయుడు మంత్రి వర్గంలో రాష్ట్ర మంత్రిగా వేణుగోపాలాచారి వ్యవహ రించారు. అప్పుడే మంత్రిగా ఉంటూ 1996 లో ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. అ నంతరం కేంద్రంలో ఇంధన వనరుల శాఖ, వ్యవసా య శాఖ మంత్రిగా పనిచేశారు. 1998 లో మరోసారి గెలిచి అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా సేవలందించారు. మూడోసారి సైతం ఆదిలాబాద్ ఎంపీగా గెలిచారు.
2004 ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీగా ఓడిపోయారు. 2009లో ముథోల్ నుంచి పోటీ చేసి, 2012లో టీడీపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేశారు. 2014లో టీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఓడిపోయారు. తర్వాత ఆయనను ఢిల్లీలో అధికార ప్రతినిధిగా సీఎం కేసీఆర్ నియమించారు. సీనియర్ నేత కావడంతో ఆయన సేవలను వినియోగించుకోవాలని తాజాగా టీఎస్ ఐడీసీ చైర్మన్‌గా అవకాశం కల్పించారు.