రైతుల కోసం ఎఫ్​పీఓ ఫైండర్ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు:  నేషనల్ అసోసియేషన్ ఫర్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎన్​ఏఎఫ్​పీఓ) తో కలసి దేశంలోనే మొట్టమొదటి డిజిటల్ పబ్లిక్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ అయిన “భారత్ ఎఫ్​పీఓ ఫైండర్”ను ప్రారంభించినట్లు   అగ్రి చైన్ ఎనెబ్యులర్  సమున్నతి ప్రకటించింది. "భారత్ ఎఫ్​పీఓ ఫైండర్" అనేది ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్​పీఓలు) కు సంబంధించిన సమగ్ర  సమాచార నిధి. దేశంలో 42 వేల ఎఫ్ పీఓల జాబితా ఇందులో ఉంటుంది.

ఈ ఫౌండర్​ద్వారా ఎఫ్​పీఓలు పరస్పరం సహకరించుకోవచ్చు.  భారతదేశ వ్యవసాయ పర్యావరణ వ్యవస్థకు మద్దతు ఇవ్వడాన్ని ఈ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్ లక్ష్యంగా పెట్టుకుంది.  ఎఫ్ పీఓ సదస్సులో జరిగిన ప్రారంభోత్సవంలో సమున్నతి డైరెక్టర్ ప్రవేశ్ శర్మ మాట్లాడుతూ భారత్ ఎఫ్ పీఓ ఫైండర్‌‌‌‌‌‌‌‌ను "ఎఫ్ పీఓల కోసం భారతదేశ గూగుల్" అని పేర్కొన్నారు.  ఒక ప్రాంతంలో పండించిన పంటలు, అందించే సేవలు,  మార్కెట్ లింక్‌‌‌‌‌‌‌‌లు వంటివి దీని ద్వారా తెలుసుకోవచ్చు.