యాక్టర్,రైటర్,డైరెక్టర్ సముద్రఖని (Samuthirakani) తన కొత్త సినిమాతో ముందుకొచ్చాడు. సముద్రఖని హీరోగా నటించిన లేటెస్ట్ తమిళ డ్రామా థ్రిల్లర్ మూవీ తిరు మాణికం. 2024 డిసెంబర్ 27న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో దూసుకెళ్తోంది. ఇందులో సముద్రఖని పోషించిన పాత్రకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. నందా పెరియసామి దర్శకత్వం వహించాడు. విశాల్ చంద్రశేఖర్ అందించిన మ్యూజిక్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.
తిరు మాణికం ఓటీటీ:
అయితే, లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. తిరు మాణికం ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు బయటికి వచ్చాయి. ఈ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5 సొంతం చేసుకుంది. అన్నీ కుదిరితే ఈ నెల జనవరి 31న తిరు మాణికం మూవీ స్ట్రీమింగ్కి వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్. వచ్చే వారంలో ఓటీటీ స్ట్రీమింగ్పై మేకర్స్ నుంచి అప్డేట్ రానుంది.ఈ మూవీలో అనన్య, భారతీరాజా, నాజర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి IMDb 9.2/10 రేటింగ్ ఇచ్చింది. దీంతో తిరు మాణికం చూడటానికి ఓటీటీ ఆడియన్స్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
తిరు మాణికం కథ:
మాణిక్యం కుమిలి (సముద్రఖని) బస్టాండ్‌లో లాటరీ దుకాణం నడుపుతూ ఉంటాడు. అతనికి తన భార్య సుమతి మరియు ఇద్దరు కుమార్తెలతో కూడిన ఆనందమైన జీవితాన్ని గడుపుతుంటాడు. అతను చేసే లాటరీ వృత్తిని నిజాయితీగా నడుపుతుంటాడు. అలా లాటరీ షాప్ నుంచి వచ్చే ఆదాయం ఎటూ సరిపోక ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటాడు. అలాంటి సమయంలో ఒక నిరుపేద వృద్ధుడు (భారతీరాజా) మాణిక్యం దుకాణాన్నికి వస్తాడు.
ALSO READ | ToxicTheMovie: ‘కేజీఎఫ్’ హీరో యష్ బర్త్డే స్పెషల్.. టాక్సిక్ నుంచి పవర్ ఫుల్ అప్డేట్
లాటరీ టిక్కెట్‌లను కొని.. మాణిక్యం దగ్గరే దాచిపెడతాడు. అతను కొన్న టిక్కెట్‌లలో ఒకటి రూ.1.5 కోట్లు గెలుచుకుంటుంది. దాంతో ముసలాయనకు వచ్చిన ఆ టికె ట్‌ను మాణిక్యం ఇచ్చాడా? లేదా? ఉన్నట్టుండిగా మాణిక్యం వెంట పోలీసులు ఎందుకు పడుతున్నారు? లాటరీ టికెట్ కారణంగా మాణిక్యం ఎలాంటి కష్టాలు పడ్డాడు? తనపై ఉన్న అభియోగాలను నిరూపించుకోవడానికి ఎలాంటి దారి ఎంచుకున్నాడు? చివరికి లాటరీ టికెట్ ఎవరి సొంతం అయిందనేది కథ.