Bonus Shares: లక్ష పెట్టుబడిని కోట్లు చేసిన స్టాక్.. ఫ్రీగా బోనస్ షేర్లివ్వటంలో రికార్డ్..

Bonus Shares: లక్ష పెట్టుబడిని కోట్లు చేసిన స్టాక్.. ఫ్రీగా బోనస్ షేర్లివ్వటంలో రికార్డ్..

Samvardhana Motherson Stock: ప్రస్తుతం మార్చి త్రైమాసికం ముగియటంతో చాలా కార్పొరేట్ కంపెనీలు తమ పెట్టుబడిదారులకు బోనస్ షేర్లు, డివిడెండ్లు వంటి ప్రయోజనాలను ప్రకటిస్తున్నాయి. దీనికి తోడు పూర్తి ఆర్థిక సంవత్సరం ముగియటంతో కంపెనీలు తమ ఇన్వెస్టర్లకు వచ్చిన లాభాలను పంచుతూ వారిని సంతోష పెడుతున్నాయి.

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది సంవర్ధన మదర్సన్ కంపెనీ షేర్ల గురించే. ఆటో విడిభాగాల తయారీ వ్యాపారంలో ప్రముఖ ఆటగాళ్లలో ఒకడిగా కంపెనీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 9 సార్లు డివిడెండ్లను అందించిన ఈ స్టాక్ చివరిసారిగా అక్టోబర్ 2022లో కంపెనీ ఇన్వెస్టర్లకు ప్రతి రెండు షేర్లను కలిగి ఉన్నందుకు గాను ఒక షేరును ఉచితంగా అందించిన సంగతి తెలిసిందే. 

వాస్తవానికి ఈ షేరు ధర 1999 జనవరిలో కేవలం ఒక్కోటి 8 పైసల వద్ద ఉంది. ఎవరైనా ఇన్వెస్టర్ అప్పట్లో కంపెనీ షేర్లలో రూ.లక్ష పెట్టుబడిగా పెట్టి దానిని ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే మార్కెట్ ప్రస్తుత ధర ప్రకారం సదరు పెట్టుబడి మెుత్తం విలువ కోట్లుగా మారిపోయింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ దాదాపు రూ.83వేల 588 కోట్లుగా ఉంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు స్టాక్ 24 శాతం మేర నష్టాన్ని చూసింది. మార్కెట్ల ప్రతికూలతలే దీనికి కారణంగా నిపుణులు చెబుతున్నారు.

అయితే కంపెనీ షేర్ల భవిష్యత్తుపై విశ్లేషకులు సానుకూలంగా ఉన్నారు. రానున్న కాలంలో కంపెనీ షేర్లు ఒక్కోటి రూ.162 స్థాయికి చేరుకుంటాయని వారు అంచనా వేస్తున్నారు. ఈ కాలంలో కంపెనీ లాభాలు 38.5 శాతం పెరుగుతాయని వారు చెబుతున్నారు. 

NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.