‘డాకు మహారాజ్’గా సంక్రాంతికి మెప్పించిన బాలకృష్ణ.. ప్రస్తుతం ‘అఖండ 2’ చిత్రం షూటింగ్‌తో బిజీ అయ్యారు. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న నాలుగో చిత్రమిది. ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు.
బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’కు ఇది సీక్వెల్. శుక్రవారం ఇందులో హీరోయిన్‌గా సంయుక్త పేరును ప్రకటించారు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న సంయుక్త.. ఇందులో కీలకపాత్రను పోషించబోతోందని మేకర్స్ తెలియజేశారు.
ALSO READ | యశ్ టాక్సిక్‌లో నయనతార..
ప్రస్తుత్వం నిఖిల్‌తో స్వయంభు, శర్వానంద్‌తో నారీ నారీ నడుమ మురారీ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ఓ చిత్రంతో పాటు మరో మూడు ప్రాజెక్ట్స్‌తో ఆమె బిజీగా ఉంది. ఇక ‘అఖండ 2’ చిత్రం దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న పాన్ ఇండియా వైడ్‌గా విడుదల కానుంది.