తెలుగులో గత ఏడాది కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించిన విరూపాక్ష చిత్రం మంచి హిట్ అయ్యింది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ కి ప్రస్తుతం టాలీవుడ్ లో ఆఫర్లు బాగానే క్యూ కడుతున్నాయి. అయితే నటి సంయుక్త మీనన్ ఇటీవలే టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు యోగేష్ కెఎంసి దర్శకత్వం వహిస్తున్న పవర్‌ఫుల్ లేడీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో నటించే ఆఫర్ దక్కించుకుంది. దీంతో ఈ రోజు ఈ చిత్ర పూజా కార్యక్రమాలు నిర్వహించి గ్రాండ్ గా లాంచ్ చేశారు.
ఈ పూజా కార్యక్రమానికి ప్రముఖ సినీ నిర్మాత మరియు హర్ రాణా దగ్గుబాటి, సినీ నిర్మాత దిల్ రాజు, సురేష్ బాబు తదితరులు హాజరయ్యారు. పూజ అనంతరం రాణా దగ్గుబాటి క్లాప్ కొడుతూ ప్రారంభించాడు. అలాగే ఈ సినిమాను హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నాడు. అయితే ఈ చిత్రానికి సంబందించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
On this sacred occasion of Navratri🙏@HasyaMovies Production No.6 with the most happening, @iamsamyuktha_ launched with an auspicious pooja ceremony ❤️🔥
— Hasya Movies (@HasyaMovies) October 9, 2024
A new age female-centric action thriller💥
Directed by #YogeshKMC
Produced by @RajeshDanda_
Presented by #Samyuktha pic.twitter.com/6jAzGSXRKl
ఈ విషయం ఇలా ఉండగా గతంలో సంయుక్త మీనన్ తెలుగులో నటించిన బింభిసార, విరూపాక్ష, భీమ్లా నాయక్, సార్ తదితర చిత్రాలు ఫర్వాలేదనిపించాయి. దీంతో సంయుక్త మీనన్ కి టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. అయితే సంయుక్త మీనన్ ప్రస్తుతం తెలుగు, తమిళ్, మలయాళం తదితర భాషలలో దాదాపుగా 5కి పైగా సినిమాలలో నటిస్తుండగా ఇందులో 2 చిత్రాలు ఇప్పటికే షూటింగ్ పూర్తీ చేసుకుని రిలీజ్ కి సిద్దంగా ఉన్నాయి.
ALSO READ| ది రాజా సాబ్ సెట్స్ నుంచి వీడియో లీక్.. స్టైలిష్ లుక్ లో ప్రభాస్.