ఇదేంది బాసూ..... రూ.50 కోట్లు కలెక్ట్ చేసిన రీ రిలీజ్ సినిమా..

ఇదేంది బాసూ.....  రూ.50 కోట్లు కలెక్ట్ చేసిన రీ రిలీజ్ సినిమా..

హిందీలో ప్రముఖ హీరో హర్ష వర్ధన్ రాణే, పాకిస్థాన్ నటి మావ్రా హోకాన్ కలసి నటించిన "సనమ్ తేరీ కసమ్" సినిమా సూపర్ హిట్ అయ్యింది. మంచి లవ్ ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ రాధికా రావు తెరకెక్కించారు. అయితే ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమాని ఫిబ్రవరి 7న రీరిలీజ్ చేశారు. దీంతో లవ్ బర్డ్స్ సనమ్ తేరీ కసమ్ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు. 

ఈ క్రమంలో ఈ సినిమా ఇప్పటివరకూ దాదాపుగా రూ.31 కోట్లు కలెక్ట్ చేసినట్లు బాలీవుడ్ సినీ వర్గాల సమాచారం. ప్రస్తుతం హిందీ స్టార్ హీరో విక్కీ కౌశల్ నటించిన "చావా" సినిమా థియేటర్స్ లో ఉన్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం తగ్గడం లేదు. దీంతో ఓవరాల్ గా సనమ్ తేరీ కసమ్ సినిమా రూ.50 కోట్లు (నెట్) కలెక్ట్ చేసింది. అంతేకాదు ఈ సినిమాని ప్రదర్శిస్తున్న థియేటర్స్ లో 80 నుంచి 90% శాతం ఆక్యుపెన్సీ ఉంటోంది. దీంతో కలెక్షన్స్ మాత్రం డ్రాప్ అవ్వడం లేదు.

స్టోరీ ఏమిటంటే..? 

ఇందర్ (హర్షవర్ధన్ రాణే) అనుకోకుండా చిన్నప్పుడే మర్డర్ కేసులో జైలుకెళ్తాడు. ఇందర్ తండ్రి పెద్ద క్రిమినల్ లాయర్ అయినప్పటికీ కొడుకుకి జైలు శిక్ష పడాల్సిందే అంటూ వాదిస్తాడు. జైలు నుంచి రిలీజ్ అయ్యాక ఇందర్ తన కుటుంబ సభ్యులకి దూరంగా ఉంటాడు. అయితే ఇదే అపార్ట్ మెంట్ లో సరస్వతి (మావ్రా హోకాన్) తన ఫ్యామిలీతో ఉంటుంది. సరస్వతి తల్లిందండ్రులు ఆంధ్రాకి చెందినవారైనప్పటికీ ముంబైలో సెటిల్ అయ్యుంటారు. సరస్వతి తండ్రి చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. అయితే సరస్వతి తన పెళ్లి విషయంలో హెల్ప్ కోసం ఇందర్ ఇంటికి వెళుతుంది. ఆ తర్వాత జరిగిన సంఘటనల కారణంగా సరస్వతి తన ఫ్యామిలీకి దూరమవుతుంది. చివరికి ఏమైంది.? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటిటి జియో సినిమాస్ లో కూడా అవైలబుల్ గా ఉంది.


11 రోజుల నెట్ కలెక్షన్స్ డీటెయిల్స్..  

శుక్రవారం: రూ. 4.25 కోట్లు
శనివారం: రూ. 5.25 కోట్లు
ఆదివారం: రూ. 6 కోట్లు
సోమవారం: రూ. 3.25 కోట్లు
మంగళవారం: రూ. 3 కోట్లు
బుధవారం: రూ. 2.5 కోట్లు
గురువారం: రూ. 2.15 కోట్లు
శుక్రవారం: రూ. 1.1 కోట్లు
శనివారం: రూ. 1.1 కోట్లు
ఆదివారం: రూ. 1.35 కోట్లు
సోమవారం: రూ. 1 కోటి  
మొత్తం: రూ. 30.95 కోట్లు (సుమారుగా)