హుజూర్ నగర్, వెలుగు : పార్లమెంట్ఎన్నికల్లో నల్లగొండ గడ్డ పై బీజేపీ జెండా ఎగరేస్తామని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం హుజూర్ నగర్ క్యాంప్ కార్యాలయంలో బీజేపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బొబ్బా భాగ్యారెడ్డితో కలిసి పార్లమెంట్ ఎన్నికల ప్రచార వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ కుటుంబ రాజకీయాలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా అడ్డగా మారిందని విమర్శించారు.
అనంతరం నేరేడుచర్ల మండల బీఆర్ఎస్మాజీ అధ్యక్షుడు చింతకుంట్ల సోమిరెడ్డి తన అనుచరులతో కలిసి సైదిరెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. బీజేపీలో చేరినవారు జగతయ్య, పిన్నపురెడ్డి మల్లారెడ్డి, హిందూజ, ఆరె పెద్ద సైదులు, కీత సోమయ్య తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఇంటి రవి, నియోజకవర్గ కన్వీనర్ అంబళ్ల నరేశ్, అధికార ప్రతినిధి పత్తిపాటి విజయ్, వెంకటేశ్వర్లు, నాయక్ పాల్గొన్నారు.