SL vs IND 2024: ఆ ముగ్గురు స్టార్ క్రికెటర్లు లేరు.. భారత్‌పై సిరీస్ గెలుస్తాం: శ్రీలంక హెడ్ కోచ్

SL vs IND 2024: ఆ ముగ్గురు స్టార్ క్రికెటర్లు లేరు.. భారత్‌పై సిరీస్ గెలుస్తాం: శ్రీలంక హెడ్ కోచ్

టీమిండియాతో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ కోసం శ్రీలంక సొంతగడ్డపై సత్తా చాటేందుకు సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగా శనివారం (జూలై 27) మొదటి టీ20 ప్రారంభం కానుంది. టీ20 వరల్డ్ కప్ తర్వాత భారత్ తొలిసారి పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగుతుంది. మరోవైపు శ్రీలంక టీ20 వరల్డ్ కప్ 2024 తర్వాత సొంతగడ్డపై తొలి సిరీస్ ఆడనుంది. బలహీనమైన లంక జట్టును చిత్తు చేయాలని భారత్ భావిస్తుంటే.. సొంతగడ్డపై భారత్ కు షాక్ ఇవ్వాలని శ్రీలంక భావిస్తుంది. 

ఈ సిరీస్ ప్రారంభం కాకముందే లంక తాత్కాలిక హెడ్ కోచ్ సనత్ జయసూరియా భారత్ పై గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా ఇటీవలే టీ20 లకు రిటైర్మెంట్ ప్రకటించారని.. ఈ అవకాశాన్ని శ్రీలంక సద్వినియోగం చేయుకుంటుందని ఆయన అన్నారు. అనుభవమున్న ఆటగాళ్లు భారత జట్టులో లేరని.. ఆ జట్టు నిర్మాణ దశలో ఉందని ఈ లంక దిగ్గజం అన్నారు. ప్రస్తుతం సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత జట్టు బలంగా ఉందని.. మా జట్టు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తుందని తెలిపారు. 

మూడు టీ20 సిరీస్ లో తొలి టీ20 జూలై 27.. రెండో టీ20 జూలై 28.. మూడో టీ20 జూలై 30 న జరుగుతాయి. వరల్డ్ కప్ ఓటమి తర్వాత శ్రీలంక క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ సిల్వర్ వుడ్ తన కోచ్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో శ్రీలంక క్రికెట్ బోర్డు అతని స్థానంలో తాత్కాలిక హెడ్ కోచ్‌గా ఆ దేశ మాజీ దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్యను ఎంపిక చేశారు. జ‌య‌సూర్య ఇటీవలే ముగిసిన టీ20 వరల్డ్ కప్ లో శ్రీలంక కన్సల్టెంట్ గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించాడు. శ్రీలంక తరపున 1991 నుండి 2007 వరకు జయసూర్య అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు.