నిరుద్యోగులను బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలే : కోట నీలిమ

నిరుద్యోగులను బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలే : కోట నీలిమ

సికింద్రాబాద్, వెలుగు: ఉద్యోగాల భర్తీ, ఉపాధి కల్పనలో బీఆర్ఎస్ సర్కార్ విఫలమైందని.. నిరుద్యోగులను మోసం చేసిందని సనత్ నగర్ సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కోట నీలిమ మండిపడ్డారు. మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్​ను ప్రకటించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. శనివారం సనత్ నగర్ డివిజన్​లోని ఎస్ఆర్టీ కాలనీలో ఆమె ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. 

ఈ సందర్భంగా నీలిమ మాట్లాడుతూ.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చామన్నారు. రాంగోపాల్​పేట డివిజన్ అధ్యక్షుడు మల్లికార్జున్, సురేశ్, ఉషా ఆధ్వర్యంలో ఆ ఏరియాలో ఆమె ప్రచారం నిర్వహించారు.