యాదగిరిగుట్టలో నేటి(ఆగస్టు 26) నుంచి పవిత్రోత్సవాలు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంతో పాటు పాతగుట్ట స్వామివారి క్షేత్రంలో శనివారం నుంచి ఈ నెల 28 వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. 

ALSO READ : పకోడీగాళ్ళు కాదు వాళ్ళే బజ్జీగాళ్ళు.. ఏపీ రాజకీయాలపై సుమన్ షాకింగ్ కామెంట్స్

ఈ మేరకు ప్రధానాలయ మాడవీధుల్లో హోమ, యజ్ఞ గుండాలను ఏర్పాటు చేసి మామిడి, అరటి తోరణాలు,  అందంగా ముస్తాబు చేశారు. కాగా, పవిత్రోత్సవాల సందర్భంగా 27, 28న ఆర్జిత సేవలు, నిత్య,  కల్యాణాలు,  సుదర్శన హోమాలు తాత్కాలికంగా రద్దు చేశారు.