భువనేశ్వర్: రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ కు సైకతా శిల్పి సుదర్శన్ పట్నాయక్ నివాళి అర్పించాడు. ఈ సందర్భంగా ఆండ్రూ సైమండ్స్ సైకతా శిల్పాన్ని రూపొందించిన ఆయన... ‘వి విల్ మిస్ యూ’ అంటూ సైమండ్స్ కు ఘన నివాళి అర్పించాడు. క్రీడా ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తుతూ ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ శనివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. సైమండ్స్ మృతి చెందాడనే విషయాన్ని అతడి అభిమానులు, అతడితో కలిసి ఆడిన ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆస్ట్రేలియా తరపున ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన సైమండ్స్... ఐపీఎల్ లో కూడా ఆడి రాణించాడు.
Sand artist Sudarsan Pattnaik paid tribute to Australian cricket star #AndrewSymonds through his sand art at Puri beach in Odisha.
— ANI (@ANI) May 15, 2022
The cricket legend died in a car crash on May 15. pic.twitter.com/wDSOaph6LH