ఖానాపూర్​లో ఇసుక డంప్​లు సీజ్

ఖానాపూర్ , వెలుగు : ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్, కోలంగూడ, ఎర్వచింతల్ గ్రామాల శివారులో అక్రమంగా డంప్​చేసిన ఇసుకను సీజ్ చేసినట్లు నిర్మల్ జిల్లా మైన్స్, రాయల్టీ ఇన్​స్పెక్టర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. నిర్మల్ కలెక్టర్ ఆదేశాలతో ఆయా గ్రామాల్లోని అక్రమ ఇసుక రీచ్ లను గుర్తించి

స్వాధీనం చేసుకున్నామన్నారు. సదరు ఇసుకను జిల్లాస్థాయి అధికారుల సమక్షంలో త్వరలోనే వేలం పాట నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఆయన వెంట ఖానాపూర్ తహసీల్దార్ బౌమిక్, ఎస్సై లింబాద్రి, రెవెన్యూ ఇన్​స్పెక్టర్ రాజు ఉన్నారు.