- ఆర్డీవో ఆధ్వర్యంలో దాడులు, వెయ్యి డంపులు సీజ్
పెబ్బేరు, వెలుగు: మండలంలోని రాంపూర్‌తో పాటు చుట్టు పక్కల గ్రామాల్లో అక్రమార్కులు నిల్వ చేసిన ఇసుక డంప్‌లపై రెవెన్యూ ఆఫీసర్లు ఉక్కుపాదం మోపారు. ఆర్డీవో పద్మావతి ఆధ్వర్యంలో తహసీల్దార్ అబ్రహం లింకన్, డీటీ తదితర ఆఫీసర్ల బృందం తనిఖీలు చేశారు. రాంపూర్‌తో పాటు కృష్ణా నది పరివాహక గ్రామాల్లో దాడులు జరిపారు.
తనీఖీలు చేసే కొద్ది ఇసుక డంపులు కనిపించడంతో రెవెన్యూ, పోలీస్ ఆఫీసర్లు ఆశ్చర్యపోయారు. వెయ్యికి పైగా ఇసుక డంపులను సీజ్ చేశారు. సీజ్ చేసిన ఇసుకను వీఆర్ఏలు, పోలీసుల కంట్రోల్లో ఉంచినట్లు ఆర్డీవో తెలిపారు.