రోడ్లపైనే ఇసుక లారీలు..రెండు గంటల ట్రాఫిక్ జామ్

వెంకటాపురం, వెలుగు : ములుగు జిల్లా టీఎస్ఎండీసీ ఆఫీసర్ల పర్యవేక్షణ లోపంతో రోడ్లపైనే ఇసుక లారీలు నిలిచిపోతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం  భద్రాచలం- వెంకటాపురం ప్రధాన రహదారి బోధాపురం, ఆలుబాక గ్రామాల మధ్య సుమారు రెండు గంటలు ట్రాఫిక్ జామ్ అయింది. ఆలుబాక పాఠశాల వద్ద లారీలు నిలవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు

ఈ రీచ్ నిర్వాహకుల నుంచి రోజువారి ముడుపులు అందడంతోటే ఆఫీసర్లు సహకరిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఆఫీసర్లు స్పందించి రహదారిపై లారీలు నిలపకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.