పాల్వంచ రూరల్, వెలుగు : గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా తరలిస్తున్న 5 ఇసుక లారీలను పాల్వంచ పోలీసులు, మైనింగ్, ఆర్టీఏ అధికారులు గురువారం పట్టుకున్నారు. భద్రాచలం మీదుగా హైదరాబాద్కు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారంతో మైనింగ్, పోలీస్ అధికారులు పాల్వంచ ఆర్టీఏ చెక్పోస్ట్ దగ్గర కాపుకాసి 5 లారీలను పట్టుకున్నారు.
ఎలాంటి అనుమతులు, వే బిల్లులు లేకపోవడంతో వాటిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించినట్లు రూరల్ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. అనుమతులు లేకున్నా భారీ ఎత్తున ఇసుక అక్రమంగా రవాణా జరగడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దందాకు పొలిటికల్ సపోర్ట్ ఉండవచ్చునని. అధికారుల ప్రమేయం కూడా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఓవర్లోడ్ చేసి మరీ రవాణా చేస్తున్నా అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పట్టుబడిన 5లారీలకు రూ. 85 వేల చొప్పున రూ. 4లక్షల 25వేలు జరిమానా వేసినట్లుతెల్సింది.