సుల్తానాబాద్ మండలంలో ఇసుక లారీ పట్టివేత 

సుల్తానాబాద్ మండలంలో ఇసుక లారీ పట్టివేత 

సుల్తానాబాద్, వెలుగు : అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను ఒకవైపు పోలీసులు పట్టుకుంటున్నప్పటికీ మరోవైపు ఇసుక మాఫియా చెలరేగిపోతోంది. బుధవారం రాత్రి సుల్తానాబాద్ మండలం నర్సయ్యపల్లి గ్రామం వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ కు మూడు లారీల ద్వారా ఇసుక తరలిస్తున్నట్లు

పోలీసులకు పక్కా సమాచారం రావడంతో తనిఖీ చేపట్టి ఒక లారీని మాత్రం పట్టుకోగలిగారు. నీరుకుల్ల మానేరు వాగు నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలించి రాజీవ్ రహదారి వెంట పలు ప్రాంతాల్లో ఇసుక మాఫియా వారు డంపులను ఏర్పాటుచేసి హైదరాబాద్ కు తరలిస్తున్నారు.