
జైపూర్, వెలుగు: మండలంలోని ఇందారంలో గోదావరి నది బ్రిడ్జి వద్ద ఇసుక రీచ్ ను మైనింగ్ ఏడీ జగన్ మోహన్ రెడ్డితో కలిసి కలెక్టర్ కుమార్ దీపక్ సోమవారం ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన తక్కువ రేటుకి ఇసుకను సరఫరా చేయనున్నట్లు చెప్పారు. సమీప గ్రామ పంచాయతీల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
సాండ్ టాక్స్ ఉన్న ట్రాక్టర్ల ద్వారానే ప్రజలకు ఇసుక రవాణా చేయాలని, పర్మిషన్ లేని వాహనాల ద్వారా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ, ఎంపీవో శ్రీపతి బాపు రావు, పంచాయతీ కార్యదర్శి సుమన్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.