
జగిత్యాల, వెలుగు : జగిత్యాల జిల్లాలో ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు పక్కాగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం మైనింగ్, పోలీస్, రెవెన్యూ అధికారులతో కలిసి ధర్మపురి, మల్లాపూర్ మండలాల్లోని గోదావరి తీర ప్రాంతాల్లోని ఇసుక రీచ్‌లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా వివిధ శాఖల సమ్వయంతో స్పెషల్ టీంలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ టీంలు చెక్ పోస్ట్‌ల వద్ద పటిష్ట భద్రత చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో ఎస్పీ అశోక్ కుమార్, అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత, ఆర్డీవోలు, అధికారులు పాల్గొన్నారు.