వడ్యాల్​లో ఇసుక దందా

వడ్యాల్​లో ఇసుక దందా

లక్ష్మణచాంద, వెలుగు : లక్ష్మణచాంద మండలం వడ్యాల్లో  ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. వడ్యాల్ వాగులో నీటిని తోడి మరీ ఇసుక దందా కొనసాగిస్తున్నారని సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు బుధవారం దాడి చేసి రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నారు.

తహసీల్దార్ జానకి ఎస్సై సుమలతకు సమాచారం ఇవ్వడంతో సిబ్బందిని పంపి ఇసుక ట్రాక్టర్లను స్టేషన్​కు తరలించారు. పదేపదే ట్రాక్టర్లు పట్టుబడుతున్నా ఫైన్ వేసి సరిపెడుతున్నారే తప్పా ఒక్క ట్రాక్టర్​ను సీజ్ చేయటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.