మహబూబాబాద్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా..ఆకేరును తోడేస్తున్నరు!

మహబూబాబాద్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా నర్సింహులపేట మండలంలోని ఆకెరు నదిని తోడేస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉన్నన్ని రోజులు సైలెంట్ అయిన ఇసుక మాఫియా తిరిగి రెచ్చిపోతోంది.10 రోజులుగా ఇసుక ట్రాక్టర్లు రయ్.. రయ్.. మంటూ చక్కర్లు కొడుతున్నాయి. 

ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఆకేరును తోడేస్తున్నా సంబంధిత అధికారులు అటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. దొంగ దారులను ఎంచుకుని చిన్నచిన్న గల్లీల గుండా ఇసుకను తరలిస్తున్నారు. 

ట్రాక్టర్ల ఓవర్​స్పీడు కారణంగా గతంలో యాక్సిడెంట్లు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయారు. ట్రాక్టర్లు వచ్చే టైంలో ఇంటి నుంచి బయటికి రావాలంటే జనం జంకుతున్నారు. అనధికారికంగా వేలం పాట వేసి మరీ ఇసుక దందా నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇసుక దందాకు అడ్డుకట్ట వేయకపోతే సాగు నీటికి ఇబ్బంది పడాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. - 

వెలుగు, నర్సింహులపేట