అశ్వారావుపేట మండలంలో ఇసుక ట్రాక్టర్లు సీజ్ 

అశ్వారావుపేట మండలంలో ఇసుక ట్రాక్టర్లు సీజ్ 

అశ్వారావుపేట, వెలుగు : ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. ఎస్సై శివరామకృష్ణ తెలిపిన వివరాలు ప్రకారం... అశ్వారావుపేట మండలం ఖమ్మంపాడు నుంచి  ఇసుకను తరలిస్తుండగా

అశ్వారావుపేట శివారులో పోలీసులు రెండు ట్రాక్టర్లను పట్టుకున్నారు. అలాగే పట్టణంలో ఇసుక దించుతుండగా.. ఒక ట్రాక్టర్ ను ఆర్ఐ కృష్ణ పట్టుకున్నారు.  ఈ మూడు ట్రాక్టర్లను తహసీల్దార్ ఆఫీస్​కు తరలించారు.