
బెజ్జంకి, వెలుగు : ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గాగిల్లాపూర్ గ్రామంలోని మోయ తుమ్మెద వాగు నుంచి తోటపల్లి, గాగిలాపూర్ గ్రామానికి ఇసుక తరలిస్తున్న 3 ట్రాక్టర్లు పట్టుకొని పీఎస్తరలించినట్లు పోలీసులు తెలిపారు .