
ఊట్కూర్, వెలుగు: అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న టిప్పర్ను పట్టుకున్నట్లు ఎస్ఐ కృష్ణంరాజు తెలిపారు. దాసరిదొడ్డి గ్రామం నుంచి దామరగిద్దకు ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇసుక తరలిస్తుండగా, మల్లేపల్లి గ్రామ శివారులో టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఓనర్ రామకృష్ణ, డ్రైవర్ యాకూబ్ అలీపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.