![అప్పుడు అట్ల.. ఇప్పుడు ఇట్ల! కేజ్రీవాల్ ఓటమికి సందీప్ దీక్షిత్ ఓ కారణమే..](https://static.v6velugu.com/uploads/2025/02/sandeep-dixit-is-the-reason-for-kejriwal-defeat_QoKSJqytUB.jpg)
న్యూఢిల్లీ: 2013లో న్యూఢిల్లీ సెగ్మెంట్ లో ఆనాటి కాంగ్రెస్ సీఎం షీలా దీక్షిత్ ను ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ ఓడిస్తే.. ఇప్పుడదే సెగ్మెంట్ లో కేజ్రీవాల్ ఓటమికి షీలా దీక్షిత్ కొడుకు సందీప్ దీక్షిత్ పరోక్షంగా కారణమయ్యారు. ఈసారి న్యూఢిల్లీ సెగ్మెంట్ లో కేజ్రీవాల్ (ఆప్), పర్వేశ్ వర్మ (బీజేపీ), సందీప్ దీక్షిత్ (కాంగ్రెస్) పోటీ పడ్డారు. అనూహ్యంగా పర్వేశ్ వర్మ విజయం సాధించి, కేజ్రీవాల్ పై 4,089 ఓట్ల మెజార్టీ సాధించారు.
వర్మకు 30,088 ఓట్లు రాగా, కేజ్రీవాల్ కు 25,999 ఓట్లు వచ్చాయి. ఇక సందీప్ దీక్షిత్ 4,568 ఓట్లు సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ కలిసి పోటీ చేసుంటే.. కేజ్రీవాల్ గెలిచేవారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. 12ఏండ్ల కింద షీలా దీక్షిత్ ను కేజ్రీవాల్ ఓడించగా.. ఇప్పుడు ఆయన ఓటమికి
ఆమె కొడుకు పరోక్షంగా కారణమయ్యారని
అంటున్నారు.