
టాలీవుడ్ ప్రముఖ హీరో పీపుల్ స్టార్ సందీప్ కిషన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా "మజాకా". ఈ సినిమాకి ధమాకా మూవీతో సూపర్ హిట్ అందుకున్న ప్రముఖ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించగా రీతూ వర్మ హీరోయిన్ గా నటించింది. వెటరన్ హీరోయిన్ అన్షు అంబానీ, రావు రమేష్, మురళీ శర్మ, శ్రీనివాస్ రెడ్డి తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.
శివరాత్రి సందర్భంగా ఈ సినిమా 26న రిలీజ్ అయింది. కామెడీ & ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా లేటు వయసులో తన తండ్రికి హీరో పెళ్లి చెయ్యాలనే కాన్సెప్ట్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. రిలీజ్ కి ముందు ఎలాంటి బజ్ లేకపోయినప్పటికీ మౌత్ టాక్ బాగుండటంతో థియేటర్లలో ఆక్యుపెన్సీ పెరుగుతోంది.
అయితే Sacnilk సమాచారం ప్రకారం మొదటి రోజు ఈ సినిమా దాదాపుగా రూ.1.75కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తే మజాకా సినిమాకి టాక్ బాగున్నప్పటికీ కొన్ని ఏరియాలలో టికెట్లు తెగడం లేదని సమాచారం. కానీ పండగ సెలవులు ఉండటంతో ఈ వారాంతానికి కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. గత కొన్నేళ్లుగా సరైన హాట్ లేక ఇబ్బంది పడుతున్న హీరో సందీప్ కిషన్ కి మజాకా సినిమాతో హిట్ పడినప్పటికీ ఓపెనింగ్ డే కలెక్షన్స్ నిరాశ పరిచాయి.