
టాలీవుడ్ ప్రముఖ హీరో పీపుల్ స్టార్ సందీప్ కిషన్, యంగ్ బ్యూటిఫుల్ హీరోయిన్ రీతూ వర్మ జంటగా నటించిన లేటెస్ట్ సినిమా "మజాకా'. ఈ సినిమాకి ప్రముఖ డైరెక్టర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించగా సినీ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర నిర్మించాడు. రావు రమేష్, వెటరన్ హీరోయిన్ అన్షు అంబానీ, సుప్రీత్, అజయ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. మజాకా సినిమా మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న రిలీజ్ కాబోతోంది. దీంతో ఈరోజు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ఈ ట్రైలర్ విశేషాలేంటో చూద్దాం.
మొదటగా "నీలాంటి కొడుకు ఈ భూ మండలం మొత్తం వెతికినా దొరకడురా" అంటూ రావు రమేష్ చెప్పే డైలాగ్ తో సందీప్ కిషన్ ఫైట్ సీన్స్ తో మొదలవుతుంది. అమ్మాయిలతో మాట్లాడాలంటే కొంచెం సిగ్గు అండీ... పెగ్గు వేసాక సిగ్గెందుకు అండీ అనే డైలాగ్ తో హీరోయిన్ రీతూ వర్మ లవ్ ట్రాక్ సీన్స్ బాగున్నాయి. ఇక హీరో తండ్రి పాత్రలో నటించిన రావు రమేష్ వెటరన్ హీరోయిన్ అన్షు అంబానీతో లవ్ ట్రాక్ సీన్స్, ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ ఇలా ట్రైలర్ మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంది. మురళీ శర్మ, సుప్రీత్, శ్రీనివాస్ రెడ్డీ ఇలా అందరికీ డైలాగులు ఉన్నాయ్. లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ బ్యాక్ డ్రాప్ లో కట్ చేసిన ట్రైలర్ మజాకా సినిమాపై ఆసక్తిని పెంచింది. మరి థియేటర్స్ లో సందీప్ కిషన్ ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.
ఈ విషయం ఇలా ఉండగా హీరో సందీప్ కిషన్ ఆమధ్య నటించిన "ఊరి పేరు భైరవకోన" సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకి థియేటర్స్ లో అలాగే ఓటిటిలో మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మజాకా సినిమాతో హిట్ ట్రాక్ కంటిన్యూ చెయ్యాలని చూస్తున్నాడు.