గంధర్వ రిలీజ్ డేట్ ఫిక్స్

గంధర్వ రిలీజ్ డేట్ ఫిక్స్

'జార్జిరెడ్డి' ఫేమ్ సందీప్ మాధవ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘గంధర్వ’. గాయత్రి ఆర్. సురేష్, శీత‌‌‌‌ల్ భ‌‌‌‌ట్ హీరోయిన్స్. సాయి కుమార్, సురేష్, బాబు మోహన్ ముఖ్యపాత్రలు పోషించారు. అప్సర్ దర్శకత్వంలో ఎమ్.ఎన్ మధు నిర్మిస్తున్నారు. జులై 1న ప్రేక్షకుల ముందుకొస్తోంది. సురేష్ కొండేటి విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ వివరాలు తెలియజేసేందుకు నిన్న ప్రెస్ మీట్ నిర్వహించారు. సందీప్ మాధవ్ మాట్లాడుతూ ‘కొత్త పాయింట్‌‌‌‌తో వస్తోన్న ఫిక్షనల్ ఫ్యామిలీ డ్రామా. ఇందులో సస్పెన్స్ ఆకట్టుకుంది. థియేటర్‌‌‌‌‌‌‌‌లో చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా’ అన్నాడు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఇండియన్ సినిమాల్లో ఇంతవరకూ రాని ఓ డిఫరెంట్‌‌‌‌ స్టోరీ లైన్‌‌‌‌తో రూపొందించాం. సెలెక్టెడ్‌‌‌‌గా సినిమాలు చేసే సందీప్, మునుపెన్నడూ కనిపించని ఓ కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నాడు’ అని చెప్పారు. ఇంతవరకూ ఎక్కడా రాని వెరైటీ పాయింట్‌‌‌‌తో ఈ సినిమా వస్తోంది’ అన్నారు సురేష్ కొండేటి. సాయికుమార్, బాబుమోహన్, వీరశంకర్, సమ్మెట గాంధీ, సూర్య, జబర్దస్త్ రాము, సంగీత దర్శకుడు ర్యాప్ రాక్ ష‌‌‌‌కీల్ తదితరులు పాల్గొన్నారు.