
ప్రభాస్-సందీప్ రెడ్డి వంగాల ‘స్పిరిట్’(SPIRIT) కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలతో కడుపు నింపుకుంటున్నారు. కానీ, ఇలా వినిపించే అప్డేట్స్లో నిజమెంత? అనేది వారిలో ప్రశ్నగా మిగిలిపోతుంది.
ఈ క్రమంలోనే స్పిరిట్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇన్నాళ్లు.. మెక్సికోలో ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకున్న‘స్పిరిట్’.. జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై యూనిట్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రానప్పటికీ, సోషల్ మీడియాలో అయితే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఇపుడీ ఈ లేటెస్ట్ బజ్ ప్రభాస్ ఫ్యాన్స్లో కొత్త జోష్ కలిగిస్తోంది. అయితే, ఇపుడు వినిపిస్తోన్న ఈ క్రేజీ అప్డేట్లో నిజముందనేది సినీ వర్గాల సమాచారం. త్వరలోనే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే.. ఇప్పటివరకూ ప్రభాస్ను మాస్, లవర్ బాయ్గా చూస్తూ వచ్చారు ఫ్యాన్స్. స్పిరిట్ సినిమాతో ఫస్ట్ టైం పోలీస్ అవతారంలో చూడబోతున్నారు. అందులోను సందీప్ రెడ్డి వంగా స్టైల్లో చూస్తుండటం ఆసక్తి పెంచుతోంది.
నిజానికి సందీప్ రెడ్డి వంగా సినిమాలో హీరోలు యాటిట్యూడ్ అండ్ షార్ట్ టెంపర్గా ఉంటారు. అదే మెయిన్ హైలెట్ అవుతుంది. ఇప్పుడు ప్రభాస్ కోసం కూడా అదే రేంజ్ క్యారెక్టర్ డిజైన్ చేసి ఉంటాడని ఫ్యాన్స్ ఆశగా ఉన్నారు.
►ALSO READ | Manchu Manoj: ‘దొంగప్ప’ అంటూ మనోజ్ సెటైరికల్ పోస్ట్.. కమిషన్ నొక్కేసాడంటూ సంచలనం
ప్రభాస్ కటౌట్కి యాటిట్యూడ్ మిక్స్ అయితే ఆ అవుట్ ఫుట్ ఏ రేంజ్లో ఉంటుందో చెప్పడం చాలా కష్టం. అలాంటి హీరో పాత్రను ఢీ కొట్టాలంటే..ఎలాంటి కటౌట్ ఉంటే బాగుంటుందనే విషయంపై సందీప్ ఇంటర్నేషనల్ వైడ్ యాక్టర్స్ను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటులు సైఫ్ అలీఖాన్ మరియు కరీనా కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.