
బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా మోస్ట్ వైల్డ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) డైరెక్షన్ లో వచ్చిన మూవీ యానిమల్(Animal). డిసెంబర్ 1న రిలీజైన మూవీ..వారం అయిన థియేటర్స్ లో దూసుకెళ్తోంది. రిలీజైన రెండోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించి బాక్సాపీస్ను షేక్ చేస్తోంది. ఈ వైల్డ్ యాక్షన్ థ్రిల్లర్ రోజురోజుకు ఆడియన్స్ పై గట్టి ప్రభావం చూపుతుంది.
ప్రస్తుతం డైరెక్టర్ సందీప్ యూఎస్ పర్యటనకు వెళ్లారు. అక్కడి తెలుగు ఆడియన్స్ తో కలిసి కాసేపు సరదాగా మాట్లాడారు. ఇందులో భాగంగా తనకు మెగాస్టార్ చిరంజీవితో కలిసి వర్క్ చేయాలని ఉందని మనసులో మాట వెల్లడించారు. చిరుని డైరెక్ట్ చేసే అవకాశం వస్తే.. తప్పకుండా ఓ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా తెరకెక్కిస్తానన్నారు.దీంతో మెగా ఫాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సినిమా చేయాలనీ సందీప్ రెడ్డి వంగాను రిక్వెస్ట్ చేస్తున్నారు.
అలాగే అక్కడున్న యూఎస్ సినీ ఆడియన్స్‌ను ఉద్దేశిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు..‘ఇప్పటి వరకూ జరిగిన ఈ చర్చా కార్యక్రమంలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే..ఈ యానిమల్ సినిమాకు సంబంధించి ఎన్నో విషయాల గురించి నన్ను మీరు అడిగారు.అలాగే నా ఇష్టాయిష్టాలను కూడా అడిగి తెలుసుకున్నారు. కానీ, స్త్రీ ద్వేషంపై ఒక్కరు కూడా నన్నుఒక్కరూ ప్రశ్నించలేదు. ఎందుకంటే, ఇక్కడ ఉన్న వాళ్లందరూ సినిమాని సినిమాలాగే చూశారు. అందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాని..సందీప్ తెలిపారు.
Director #SandeepReddyVanga is Planning to Write an Action Drama for Megastar #Chiranjeevi garu @imvangasandeep said in US Meet Today ?
— Chiranjeevi Army (@chiranjeeviarmy) December 9, 2023
Boss @KChiruTweets #MegastarChiranjeevi pic.twitter.com/QKRgfKV8No