మెక్సికోలో ప్రభాస్ స్పిరిట్ షూటింగ్.. ఆ హాలీవుడ్ హీరో కూడా వస్తున్నాడా.?

మెక్సికోలో ప్రభాస్ స్పిరిట్ షూటింగ్.. ఆ హాలీవుడ్ హీరో కూడా వస్తున్నాడా.?

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రభాస్ తో "స్పిరిట్" అనే సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ ఆర్మీ ఆఫిసర్ పాత్రలో కనిపించనున్నాడు. స్పిరిట్ సినిమాని సందీప్ రెడ్డి భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ఇతర సినిమాల షూటింగులతో బిజీగా ఉండటంతో సందీప్ రెడ్డి ప్రీ ప్రొడక్షన్ పనులు సైలెంట్ గా మొదలు పెట్టాడు. దీంతో క్యాస్ట్ అండ్ క్రూతోపాటూ లొకేషన్స్ ని కూడా వెతుకుతున్నాడు. 

ప్రస్తుతం సందీప్ రెడ్డి మెక్సికో లో స్పిరిట్ సినిమా కోసం షూటింగ్ లొకేషన్స్ చూస్తున్నట్లు సమాచారం. ఇందులో ముఖ్యంగా కొన్ని ఫారెస్ట్ ఏరియాలలో వార్ ఫాట్ సీన్స్ తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఓ ఫ్యామిలీ ఫంక్షన్ కోసం ఇటీవలే యూఎస్ వెళ్లిన సందీప్ రెడ్డి పనిలోపనిగా హాలీవుడ్ హీరో "లీ డాంగ్-సేక్" కి స్టోరీ నెరేట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ప్రభాస్ స్పిరిట్ ఈ ఏడాది చివరిలో పట్టాలెక్కనుంది. అయితే ప్రభాస్ ఈ సినిమా కోసం కేవలం 90 రోజులు మాత్రమే షూటింగ్ లో పాల్గొననున్నట్లు సమాచారం. ముంబై, హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో కూడా షూటింగ్ చెయ్యనున్నారు. దీంతో స్పిరిట్ వచ్చే ఏడాది చివరిలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ALSO READ | Trisha: హాట్ టాపిక్ గా మారిన త్రిష ఉంగరం.. ఎంగేజ్మెంట్ అయిపోయిదా..?

అయితే స్పిరిట్ లో ప్రభాస్ కి విలన్ గా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతిని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే విజయ్ కి సందీప్ రెడ్డి స్పిరిట్ స్టోరీ వినిపించగా విజయ్ కూడా వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం.అయితే స్పిరిట్ లో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నట్లు రూమర్లు రావడంతో సోషల్ మీడియాలో అప్పుడే హైప్ మొదలైంది.