SandeepReddyVanga: అర్జున్‍ రెడ్డికి సాయిపల్లవిని అనుకున్నా.. స్లీవ్‍లెస్సే వేసుకోదన్నారు

SandeepReddyVanga: అర్జున్‍ రెడ్డికి సాయిపల్లవిని అనుకున్నా.. స్లీవ్‍లెస్సే వేసుకోదన్నారు

నాగ చైతన్య, సాయి పల్లవి కాంబోలో వస్తోన్న మూవీ తండేల్. ఈ మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ఆదివారం (ఫిబ్రవరి 2న) ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (SandeepReddyVanga) ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ క్రమంలో సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. 

‘ అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్ కోసం చూస్తూ మొదట సాయి పల్లవిని తీసుకుందాం అనుకున్నామని చెప్పారు. అయితే, అది ఎందుకు సాధ్యం కాలేదో వివరించారు. 

ఈ క్రమంలో తాను ఓ కోఆర్టినేటర్‌కు కాల్ చేశానని తెలిపారు. అప్పుడు అతనుండి.. 'ఆ అమ్మాయి స్లీవ్ లెస్ డ్రెస్సే వేసుకోరని, ఈ సినిమాని  అసలు ఒప్పుకోరని.. ఇక తన గురించి మర్చిపోండని' ఆయన చెప్పినట్టు సందీప్ అన్నారు.

అయితే, ఎవ్వరైనా మొదట్లో ఇలానే ఉంటారు.. కొన్నేళ్ల తర్వాత హీరోయిన్స్ ఎంతో కొంత మారతారని అనిపినించిందని చెప్పారు. కానీ, పదేళ్లు అయినా సాయి పల్లవి ఏమాత్రం మారలేదు. ఆ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ అని సాయి పల్లవిపై ప్రశంసలు కురిపించారు సందీప్ రెడ్డి వంగా.

అలాగే తండేల్ మూవీ గురించి మాట్లాడుతూ.. టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఏదీ చూసినా ఎమోషనల్‌‌గా కనెక్ట్ అవుతున్నాయి. నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ అందర్నీ ఆకట్టుకుంటుంది. సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది’ అని సందీప్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఇక సాయి పల్లవి ఈ విషయంపై స్పందిస్తూ.. ' ఎవరు ఏ సినిమా చేయాలనీ రాసి పెట్టింటుందో అదే చేస్తారని సాయి పల్లవి అన్నారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి ఎలా రావాలని బలంగా కోరుకున్నారో.. సినిమా అలాగే వచ్చిందని తెలిపింది. ఇందులో నటించిన హీరోయిన్ షాలినీ పాండే సూపర్బ్ గా యాక్ట్ చేసినట్టు సాయి పల్లవి తెలిపింది. విజయ్ కూడా అద్భుతం చేశారని అన్నారు". ప్రస్తుతం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మాట్లాడిన స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.