Thandel: నాగ చైతన్య కెరీర్‌‌‌‌లో నిలిచిపోయేలా తండేల్‌‌ మూవీ : తండేల్‌‌ చిత్ర బృందం

Thandel: నాగ చైతన్య కెరీర్‌‌‌‌లో  నిలిచిపోయేలా తండేల్‌‌ మూవీ : తండేల్‌‌ చిత్ర బృందం

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందూ మొండేటి రూపొందించిన చిత్రం ‘తండేల్’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్  నిర్మించారు.  ఫిబ్రవరి 7న పాన్ ఇండియా వైడ్‌‌గా సినిమా విడుదల కానుంది.

ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ను నిర్వహించారు. అతిథిగా  హాజరైన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ ‘ఈ మూవీ టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఏదీ చూసినా ఎమోషనల్‌‌గా కనెక్ట్ అవుతున్నాయి. 

నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ అందర్నీ ఆకట్టుకుంటుంది. సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది’ అని చెప్పాడు.  ఈ  కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు ఈ మూవీ సక్సెస్ సాధించాలని కోరుతూ టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్‌‌  చెప్పారు. నాగ చైతన్య మాట్లాడుతూ ‘గీతా ఆర్ట్స్ బ్యానర్‌‌‌‌ నా కెరీర్‌‌‌‌లో ఎప్పుడూ టాప్‌‌లో ఉంటుంది. ఈ బ్యానర్‌‌‌‌లో ‘తండేల్’ చేయడం అదృష్టంగా భావిస్తున్నా. 

చందుతో పాటు నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. సాయి పల్లవి లాంటి పాజిటివ్ పర్సన్‌‌తో వర్క్ చేయడం హ్యాపీ. ఇందులోని పాటలను ప్రజల దగ్గరకు బాగా చేరువ చేశాడు దేవిశ్రీ ప్రసాద్. ఇందులో  మత్స్యకారుల జీవితాలను చూపించాం’ అని చెప్పాడు.

సాయి పల్లవి మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నాగ చైతన్య ట్రాన్స్‌‌ఫర్మేషన్ చూస్తారు. ఆయనతో వర్క్ చేయడం హ్యాపీ. ఇందులోని  సీన్స్ అన్ని చాలా ఫ్రెష్‌‌గా ఉంటాయి. చందూ మొండేటి చాలా క్లారిటీతో రూపొందించారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని చెప్పింది. 

ఈ చిత్రం విజయంపై నమ్మకం ఉన్నామని దర్శకుడు చందూ మొండేటి అన్నాడు. నాగ చైతన్య గారి కెరీర్‌‌‌‌లో నిలిచిపోయే సినిమా అని,  ప్రతి ఒక్కర్నీ సర్‌‌‌‌ప్రైజ్ చేసేలా ఆయన నటన ఉంటుందని నిర్మాత బన్నీ వాస్ చెప్పారు. నిర్మాత బన్నీ వాస్ అన్నారు.  మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దత్, ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర, ఎడిటర్ నవీన్ నూలి,  లిరిసిస్టులు జొన్నవిత్తుల, శ్రీమణి తదితరులు పాల్గొన్నారు.