యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తున్న స్పిరిట్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ హీరో సైఫ్ అలీ ఖాన్ మరియు కరీనా కపూర్ కపుల్స్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక సందీప్ రెడ్డి స్వంత బ్యానర్ అయిన భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమా స్టార్ట్ అయ్యి ఇప్పటికే రెండేళ్ళు అవుతున్నపటికీ ప్రభాస్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో పట్టాలెక్కలేదు. కానీ సందీప్ రెడ్డి మాత్రం మ్యూజిక్ కి సంబందించిన పనులు మొదలు పెట్టేశాడు.
ALSO READ | రామ్ చరణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. గేమ్ ఛేంజర్ టీజర్ అప్డేట్ వచ్చేసింది..
అయితే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ తో కలసి స్పిరిట్ సినిమా మ్యూజిక్ పనులు స్టార్ట్ చేశాడు. ఈ క్రమంలో దీపావళి సందర్భంగా హర్షవర్ధన్ రామేశ్వర్ తన సోషల్ మీడియా ద్వారా స్పిరిట్ అప్డేట్ ఇచ్చాడు. ఇందులో భాగంగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో కలసి మ్యూజిక్ కంపోస్ చేస్తున్న వీడియొని షేర్ చేశాడు. ఈ వీడియో ఎండింగ్ లో స్పిరిట్ సినిమా టైటిల్ పడింది. ఈ వీడియోకి "మ్యూజిక్ వర్క్ జస్ట్ బిగెన్" అంటూ క్యాప్షన్ పెట్టాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ దీపావళి అప్డేట్ అదిరింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
"Music work just began"#spirit#sandeepreddyvanga#bhadrakalipictures#Tseries pic.twitter.com/h5Qf6hjBPY
— Harshavardhan Rameshwar (@rameemusic) October 31, 2024
ఈ విషయం ఇలా ఉండగా ప్రభాస్ ప్రస్తుతం ది రాజా సాబ్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా కి ప్రముఖ డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తుండగా నిధి అగర్వాల్, మాళవిక మోహన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా దాదాపుగా 70% శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. దీంతో ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ప్రభాస్ స్పిరిట్ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు సమాచారం.