నెలరోజుల్లో పనులు షురూ.. అదిరిపోయే ట్విస్ట్ ఇవ్వనున్న సందీప్

నెలరోజుల్లో పనులు షురూ.. అదిరిపోయే ట్విస్ట్ ఇవ్వనున్న సందీప్

యానిమల్(Animal) సక్సెస్ తో దేశం మొత్తాన్ని తనవైపుకు తిప్పుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga). బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్(Ranbir Kapoor). నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) జంటగా వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సాధించింది. మొదటిరోజు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా.. లాగ్ రన్ లో ఏకంగా రూ.900 కోట్లు కొల్లగొట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. దీంతో సందీప్ రెడ్డి వంగ పేరు ఒక బ్రాండ్ గా మారిపోయింది. ఇక ఆయన తరువాతి సినిమాలపై ఇప్పటినుండే అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. 

ఇక సందీప్ తన తరువాతి సినిమా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) తో చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. స్పిరిట్(Spirit) పేరుతో రానున్న ఈ సినిమా కూడా సందీప్ గత చిత్రాల లాగే ఫుల్ వైలెంట్ గా ఉంటుందని ప్రకటించడంతో.. అంచనాలు ఆకాశయానికి తాకుతున్నాయి. దీంతో స్పిరిట్ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చుస్తునారు. అయితే తాజాగా సమాచారం ప్రకారం స్పిరిట్ సినిమా ఆలస్యం కానుందట. కారణం ప్రభాస్ ప్రస్తుతం వేరే కమిట్మెంట్స్ తో ఫుల్ బిజీగా గడుపుతున్నాడట. అందులో ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సలార్2, మారుతీ తో చేస్తున్న రాజాసాబ్, నాగ్ అశ్విన్ తో చేస్తున్న కల్కి  సినిమాలున్నాయి. 

దాంతో స్పిరిట్ మూవీ కోసం డేట్స్ కేటాయించలేకపోతున్నాడట ప్రభాస్. దీంతో యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ ను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడట సందీప్. మరో నెలరోజుల్లో స్క్రిప్ట్ వర్క్ అండ్ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టనున్నాడట. 2025 ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందట. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. మరి భారీ అంచనాలున్న యానిమల్ పార్క్ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.