
శామీర్ పేట, వెలుగు: చెరువులో నీట మునిగిన ఇద్దరిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలం పొన్నాల గ్రామ పరిధిలోని గండిచిత్తారమ్మ- పెద్దమ్మ తల్లి ఆలయానికి ఆరుగురు మిత్రులు ఆదివారం విహారయాత్రకు వెళ్లారు. వీరిలో సందీప్ సాగర్ (27), పాలసంతుల బాలు అక్కడి చెరువు కుంటలో సాయంత్రం ఈతకు దిగి గల్లంతయ్యారు.
అప్పటికే చీకటి పడడంతో పోలీసులకు గాలింపు సాధ్యం కాలేదు. సోమవారం ఉదయం సందీప్ మృతదేహం పైకి తేలడంతో వెలికితీసి పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గల్లంతైన మరో యువకుడి కోసం ఇంకా గాలిస్తున్నారు.