రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలర్ సందీప్ శర్మ ప్రస్తుత ఐపీఎల్ లో సత్తా చాటుతున్నాడు. గాయం కారణంగా కొన్ని మ్యాచ్ లకు దూరమైనా ఆడిన ప్రతి మ్యాచ్ లో ప్రభావం చూపించాడు. నిన్న (ఏప్రిల్ 22) ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా 5 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఈ వెటరన్ బౌలర్ ధాటికి స్టార్ బ్యాటర్లు దగ్గర సమాధానం లేకుండా పోయింది. నాలుగు ఓవర్లలో కేవలం 18 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి ఐపీఎల్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్పెల్ నమోదు చేశాడు.
కొత్త బంతితో స్వింగ్ తిప్పడమే కాదు.. డెత్ ఓవర్లలో వేరియేషన్స్ తో బ్యాటర్లను కట్టడి చేయగలడు. 2023 సీజన్ లో కంబ్యాక్ ఇచ్చి అదరగొట్టిన ఈ సీనియర్ పేసర్.. అదే ఫామ్ ను ప్రస్తుత సీజన్ లోనూ కొనసాగిస్తున్నాడు. అయితే సందీప్ ను రెండేళ్ల క్రితం వేలంలో ఎవరూ పట్టించుకోలేదు. రికార్డ్స్ బాగున్నా ఈ వెటరన్ బౌలర్ ను కొనడానికి ఎవరు ఆసక్తి చూపించలేదు. వేరే బౌలర్ కు రీప్లేస్ గా రాజస్థాన్ జట్టులో చేరాడు. ఇక్కడ నుంచి సందీప్ శర్మ తన సెకండ్ ఇన్నింగ్స్ లో అదరగొట్టాడు.
Also Read:బెంగళూరు బాటలోనే ముంబై.. ప్లే ఆఫ్ ఆశలు ముగిసినట్టేనా..?
ముంబైతో నిన్న జరిగిన మ్యాచ్ లో 5 వికెట్లు తీసిన తర్వాత సందీప్ ఎమోషనల్ అయ్యాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం జరిగిన వేలంలో అమ్ముడుపోలేదు. వేరే ప్లేయర్ ప్లేస్ లో రీప్లేస్ గా వచ్చాను.దీంతో నాకు వచ్చిన ప్రతి మ్యాచ్ ను ఆస్వాదిస్తున్నానని మ్యాచ్ అనంతరం సందీప్ చెప్పాడు. అదే విధంగా స్లాగ్ ఓవర్లలో ఇబ్బంది పడుతున్న బౌలర్లకు అతను ఒక సలహా కూడా ఇచ్చాడు.
From being unsold in the IPL 2023 auction to joining Rajasthan Royals and clinching victories for them 🫡
— CricTracker (@Cricketracker) April 23, 2024
Sandeep Sharma's journey is one of remarkable resilience and determination. pic.twitter.com/9K3ule0nZm