
అహ్మదాబాద్ : గాయంతో ఈ సీజన్ ఐపీఎల్‌కు దూరమైన సీనియర్ పేసర్ మమ్మద్ షమీ ప్లేస్‌లో మీడియం పేసర్ సందీప్ వారియర్‌ను గుజరాత్ టైటాన్స్ తమ టీమ్‌లోకి తీసుకుంది. గాయానికి సర్జరీ చేయించుకున్న షమీ కోలుకునేందుకు కొన్ని నెలలు పట్టనుంది.
దాంతో కేరళకు చెందిన సందీప్‌ను రూ.50 లక్షల బేస్‌ప్రైజ్‌తో గుజరాత్ తమ జట్టులో చేర్చింది. మరోవైపు గాయంతో సీజన్ నుంచి వైదొలిగిన శ్రీలంక పేసర్ దిల్షన్ మదుషంక స్థానంలో ముంబై ఇండియన్స్ సౌతాఫ్రికా పేసర్ క్వెనా మఫాకను తీసుకుంది.