నీ మొగుడు వేస్ట్.. ప్రశాంత్ జోలికి వస్తే వదలం.. కన్నీళ్లు పెట్టుకున్న సందీప్ భార్య

ఎవరిపైనా అయినా అభిమానం ఉండటం తప్పుకాదు. కానీ దానివల్ల ఎదుటివారు అగౌరపడకుండా చూసుకోవాలి. కొంతమంది అభిమానం పేరుతో హద్దులు దాటుతున్నారు. ఎదుటివాళ్ళని ఇష్టమొచ్చినట్టుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్(Bigg boss season7) కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్(Pallavi prashanth) ఫ్యాన్స్ అదే చేస్తున్నారు. హౌస్ లో తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న కంటెస్టెంట్స్ కుటుంబాలను టార్గెట్ చేస్తున్నారు. వారిపై అసభ్యకరమైన కామెంట్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు. 

ఇటీవల అమర్ దీప్ ఫ్యమిలీపై కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. వాటిపై అమర్ దీప్ తల్లి ఎమోషనల్ అవుతూ వీడియో కూడా చేశారు. ఇప్పుడు తాజాగా సందీప్ భార్య జ్యోతికి కూడా అలాంటి పరిస్థితే ఎదురయింది. ఇదే విషయాన్ని సందీప్ భార్య జ్యోతి రాజ్.. ఒక ఇంటర్వ్యూలో చెప్తూ ఎమోషనల్ అయ్యారు.

సందీప్ కు రియాలిటీ షోలు కొత్తేమి కాదు. చాలా వాటల్లో పాల్గొని విన్నర్ గా నిలిచాడు. తాను చేసే ఏపనైనా చాలా కష్టపడతాడు. గెలిచేదాకా వదలదు. అలానే బిగ్ బాస్ కూడా. కానీ.. బిగ్ బాస్ అనేది ఒక కొత్త అనుభవం. డ్యాన్స్ వేరు. బిగ్ బాస్ షో వేరు. సందీప్ ఇంట్రోవర్ట్. ఎవరితోనైనా కలవడానికి కాస్తా సమయం పడుతుంది. మా డ్రీమ్ ను నెరవేర్చడానికి మాత్రమే ఆయన హౌస్ లోకి వెళ్లాడు. దాని కోసం సందీప్ సపోర్ట్ గా వీడియోలు పోస్ట్ చేసిన ప్రతిసారి.. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అసభ్యకరమైన కామెంట్స్ పెడుతున్నారు. నీ మొగుడు వేస్ట్.. ప్రశాంత్ జోలికొస్తే వదలం. నీ మొగుడికి చెప్పు.. ప్రశాంత్‌ జోలికి రావొద్దని. అంటూ చాలా దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.. అని చెప్తూ ఎమోషనల్ అయ్యారు జ్యోతి రాజ్. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.