భగీరథమ్మ చెరువు శిఖం భూమి కబ్జా

  • కబ్జా వెనుక సంధ్య కన్వెన్షన్​ ఎండీ శ్రీధర్​రావు

గచ్చిబౌలి, వెలుగు: ఖాజాగూడ మెయిన్​రోడ్డుకు ఆనుకొని ఉన్న భగీరథమ్మ చెరువు శిఖం స్థలాన్ని కొందరు కబ్జా చేస్తున్నారని హైడ్రా అధికారులు గుర్తించారు. వారి సమాచారంతో ఇరిగేషన్, ఇంజనీరింగ్ అధికారులు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు మట్టిపోసి చదును చేస్తున్నవారిని, జేసీబీ ఓనర్​సురేశ్​ను అరెస్ట్​చేశారు.

దాదాపు 700 గజాల స్థలాన్ని మట్టితో నింపినట్లు గుర్తించారు. సంధ్య కన్వెన్షన్​ ఎండీ శ్రీధర్​రావు డైరెక్షన్​లోనే చెరువు శిఖం స్థలం కబ్జా చేస్తున్నారని తెలుసుకున్నారు. శ్రీధర్​రావుపై భూకబ్జా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.