
సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుని హైదరాబాద్ రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించి పలువురిని శ్రీధర్ రావు మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. భవనం అమ్మకాల విషయంలో కొనుగోలుదారులను మోసగించారు. కొనుగోలుదారుల నుంచి భారీగా నగదును వసూలు చేశారు. దాంతో శ్రీధర్ పై చీటింగ్ కేసు నమోదు చేశారు రాయదుర్గం పోలీసులు. ఎన్ఆర్ఐ ముక్కామల అప్పారావు, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ట్రస్ట్ మెంబర్ తులసిని మోసం చేసినట్లు శ్రీధరరావుపై ఆరోపణలు ఉన్నాయి. 28వేల ఎస్ ఎఫ్టీ స్పేస్ కు రూ.15కోట్లు అడ్వాన్స్ తీసుకుని వెనక్కి ఇవ్వలేదని శ్రీధర్ రావుపై ఆరోపణలు వచ్చాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని ఐసీఐసీఐ దగ్గర 12ఎకరాల భూమికి సంబంధించి మరో వివాదంలో శ్రీధర్ రావు పేరు ఉంది.