అవినీతి ఆరోపణలు.. బల్దియా హెడ్డాఫీసుకు అటాచ్

అవినీతి ఆరోపణలు.. బల్దియా హెడ్డాఫీసుకు అటాచ్

హైదరాబాద్, వెలుగు: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జీహెచ్ఎంసీ కూకట్ పల్లి, శేరిలింగంపల్లి సీనియర్ ఎంటమాలజిస్ట్ సంధ్యను హెడ్డాఫీసుకు అటాచ్ చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి బుధవారం ఆదేశాలు జారీ చేశారు. దోమల నివారణకు ఫాగింగ్ చేయకుండానే డీజిల్ బిల్లులు కొట్టేసినట్లు సంధ్యపై ఆరోపణలు ఉన్నాయి. సూపర్​వైజర్లు, అసిస్టెంట్ ఎంటమాలజిస్టుల నుంచి డబ్బులు వసూలు చేయడమే కాకుండా పని చేయని రోజుల్లో ఫాగింగ్ పేరుతో బిల్లులు డ్రా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. 

ఈ విషయమై పలువురు యూనియన్ నేతలు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.  ప్రాథమిక విచారణ అనంతరం ఆమెను కమిషనర్​హెడ్డాఫీసుకు అటాచ్ చేశారు. విచారణ అనంతరం నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ విభాగాన్ని ఆదేశించారు. కూకట్​పల్లి, శేరిలింగంపల్లి సీనియర్ ఎంటమాజిస్ట్​గా శానిటేషన్ జాయింట్ కమిషనర్లకు ఇన్​చార్జ్ బాధ్యతలు అప్పగించారు.