ఆరోజు థియేటర్ నిర్వహణ బాధ్యత మైత్రి మూవీస్​దే

ఆరోజు థియేటర్ నిర్వహణ బాధ్యత మైత్రి మూవీస్​దే
  • పోలీసుల నోటీసులకు సమాధానం ఇచ్చిన సంధ్య థియేటర్

ముషీరాబాద్, వెలుగు: సంధ్య థియేటర్​ఘటనలో పోలీసుల షోకాజ్ నోటీసులకు యాజమాన్యం సమాధానం ఇచ్చింది. ఆరు పేజీల లేఖను న్యాయవాదుల ద్వారా పోలీసులకు పంపించింది. సంధ్య థియేటర్ కు అన్ని అనుమతులు ఉన్నాయని నోటీసుల్లో యాజమాన్యం పేర్కొంది. ‘‘సంధ్య థియేటర్ 45 ఏండ్లుగా ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. గతంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదు.

‘పుష్ప–2’ ప్రీమియర్ షో సందర్భంగా థియేటర్ లో 80 మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. టాకీస్ నిర్వహణ బాధ్యతను డిసెంబర్ 4, 5 తేదీల్లో మైత్రీ మూవీస్ తీసుకుంది. గతంలో అనేక సినిమాలు విడుదల సందర్భంగా హీరోలు థియేటర్ కు వచ్చి సినిమాను వీక్షించేవారు. టాకీస్ లో కారులు, ద్విచక్ర వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ సదుపాయం ఉంది”అని వివరించింది.