హైదరాబాద్: హీరో అల్లు అర్జున్ను జూబ్లీహిల్స్లోని తన ఇంట్లోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి పోలీస్ వాహనంలోనే హైదరాబాద్ సిటీలోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్లు జరిగాయి. ప్రాథమిక దర్యాప్తులో సంధ్య థియేటర్ యజమానుల్లో ఒకరైన సందీప్, థియేటర్ సీనియర్ మేనేజర్ నాగరాజు, థియేటర్ లోయర్ బాల్కనీ, అప్పర్ బాల్కనీ ఇన్చార్జి గంధకం విజయ చందర్ను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. వారికి మేజిస్ట్రేట్ రిమాండ్ విధించారు.
Also Read :- హీరో అల్లు అర్జున్ అరెస్ట్
థియేటర్ యాజమాన్యం ముందుగా సమాచారం ఇవ్వకపోవడంతోనే తొక్కిసలాట జరిగి ఓ మహిళ చనిపోయింది. దాంతోపాటు ఆమె కొడుకు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించి లోతైన దర్యాప్తు జరిపి ఘటనకు బాధ్యులైన ప్రతి ఒక్కరికీ శిక్షపడేలా చేస్తామని పోలీసులు తెలిపారు. అలాగే, ప్రీమియర్ షో సందర్భంగా సినిమా చూడడానికి వచ్చిన నటుడు అల్లు అర్జున్కు నోటీసులు జారీచేసే అంశంపై ఉన్నతాధికారులు న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నారు.
పోలీస్ వాహనంలోనే.. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్ : సంధ్య ధియేటర్ కేసుపై విచారణ pic.twitter.com/VAgXkSc9No
— Prashanth (@itzmibadboi) December 13, 2024
శుక్రవారం అల్లు అర్జున్ను అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పీఎస్కు తరలించారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ సీఐ రాజు నాయక్, ఎస్సై మౌనికతో కలిసి చిక్కడపల్లి పోలీస్ డివిజన్ ఏసీపీ రమేశ్‌కుమార్ వివరాలు వెల్లడించారు. ప్రీమియర్ షో సందర్భంగా సాయికిరణ్ అనే వ్యక్తి థియేటర్ లోపలి నుంచి అరవగా కానిస్టేబుల్ ఆంజనేయులు, ఎస్సై ప్రసాద్ రెడ్డి, మౌనిక సిబ్బందితో కలిసి రేవతి, ఆమె కొడుకు శ్రీ తేజ్ను బయటకు తీసుకువచ్చి సీపీఆర్చేశారు. ప్రస్తుతం శ్రీతేజ్పరిస్థితి నిలకడగా ఉంది” అని చిక్కడపల్లి పోలీస్ డివిజన్ ఏసీపీ రమేశ్‌కుమార్ తెలిపారు.